ఇక ఈ ఏడాదిలో బాలీవుడ్ ఆశలన్నీ ఈ భారీ సినిమాపైనే..!

ఇక ఈ ఏడాదిలో బాలీవుడ్ ఆశలన్నీ ఈ భారీ సినిమాపైనే..!

Published on Aug 14, 2022 3:00 AM IST

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దారుణంగా ఉందని చెప్పాలి. అక్కడి బాక్సాఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ ఈ ఏడాది రిలీజ్ అయ్యిన 95 శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వైఫల్యం అయ్యాయి. మరి ఈ డిజాస్టర్ ట్రెండ్ కి ఎంగ్ కార్డ్ లా రీసెంట్ చిత్రాలు “లాల్ సింగ్ చడ్డా” మరియు “రక్షా బంధన్” లు మారుతాయి అనుకుంటే ఈ సినిమాలకి కూడా ఆశ్చర్యకరంగా ఇదే పరిస్థితి నెలకొంది.

ఇక మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చింది. పైగా బాలీవుడ్ లో వారి సినిమాలు తప్ప ఇతర భాషల నుంచి వస్తున్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయనీ ఓ టాక్ ఉంది. దీనితో బాలీవుడ్ బాక్సాఫీస్ కం బ్యాక్ కోసం వారు చూస్తున్నారు. అయితే ఈ ఏడాదికి మాత్రం మేజర్ సినిమాగా అది కూడా హిందీ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర” రిజల్ట్ కోసమే అంతా ఆసక్తిగా మారింది.

వచ్చే నెలలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా చాలా గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో ఇండియన్ సినిమా దగ్గర ఓ హెవీ గ్రాఫికల్ వండర్ గా తెరకెక్కింది. దీనితో ఈ సినిమా ఫలితం కోసమే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిగతా సినిమాల్లా కాకుండా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకి వస్తాయని మంచి బజ్ కూడా ఉంది. మరి దర్శకుడు అయాన్ ముఖర్జీ, రణబీర్ మరియు ఆలియాలు ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు