తెలుగులో మరో సినిమాకు సైన్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ?


హిందీలో ‘ఇస్సాక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత ‘అనేగన్’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించిన నటి అమైరా దస్తూర్ తెలుగు వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు సోదరిదర్శకత్వం వహిస్తూ సందీప్ కిషన్ హీరోగా మొదలుపెట్టిన సినిమాలో హీరోయిన్ గా కుదిరిన ఈమె తాజాగా మరో సినిమాకు ఒప్పుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారట. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తారని సమాచారం. ఇప్పటికే ‘శమంతకమణి, వీరభోగ వసంతరాయలు’ వంటి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే మొదలుపెడతారని అంటున్నారు. అయితే ఈ విషయంపై సంబంధిత నటీనటుల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.