శర్వానంద్ సరసన బాలీవుడ్ భామ.?

kiara-advani_Sharwanand1
‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి సినిమాని ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తొలి హిట్ అందుకున్న మేర్లపాక గాంధీతో చేయనున్నాడు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నారు. శర్వానంద్ – మేర్లపాక గాంధీ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా ఓ బాలీవుడ్ భామని పరిశీలిస్తున్నారు. గత సంవత్సరం ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన కైరా అద్వానీని ఈ సినిమా లో ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్నీ డైరెక్టర్ మేర్లపాక గాంధీని అడిగితే ‘మాకు కథా పరంగా సినిమాలో ఫ్రెష్ హీరోయిన్ అయితే బాగుంటుంది.. అందులో భాగంగానే కైరా అద్వానీని ఒక చాయిస్ గా పెట్టుకున్నాం. కానీ ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదని’ అన్నాడు. ఫైనల్ గా శర్వానంద్ కి జోడీగా నటించే అవకాశం కైరా అద్వానీకి దక్కుతుందా లేక వేరెవరికన్నా వెళ్తుందా అనేది చూడాలి..

Exit mobile version