ఢిల్లీ ఈవెంట్ కోసం బాలీవుడ్ బిగ్ స్టార్ ని దింపుతున్న “RRR” యూనిట్.!

Published on Mar 20, 2022 5:00 pm IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” అని తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సాలిడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ పై నెక్స్ట్ లెవెల్ అంచనాలు నెలకొనగా..

దీనిపై ఇప్పుడు మేకర్స్ రిలీజ్ లోపు దేశ వ్యాప్తంగా అనేక ఈవెంట్స్ ని ప్లాన్ చేసి రిలీజ్ ఒక్కోదానికి అటెండ్ అవుతున్నారు. మరి ఈ ఈవెంట్స్ లో ఈరోజు సాయంత్రం ఢిల్లీ లో కూడా ఒక కీలక ఈవెంట్ ఉండగా ఆ ఈవెంట్ కి గాను బాలీవుడ్ కి చెందిన బిగ్ స్టార్ అయినటువంటి ఆమీర్ ఖాన్ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు.

ఇది ఒక బిగ్ అనౌన్సమెంట్ అనే చెప్పాలి. మరి ఆమీర్ ఎలాంటి అనుభవాలను పంచుకుంటారో చూడాలి. మరి ఈ ఈవెంట్ రేపు సాయంత్రం 7 గంటలకు ఇంపెరియల్ న్యూ ఢిల్లీ హోటల్లో స్టార్ట్ అవ్వనుంది.

సంబంధిత సమాచారం :