ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో వండర్స్ నమోదు చేస్తున్నాయో చూస్తున్నాము. అయితే ఈ లిస్ట్ లో ఎక్కువగా మన తెలుగు నుంచే ఉండగా హిందీలో మాత్రం ఎప్పుడు నుంచో మంచి మోస్ట్ అవైటెడ్ గా వస్తున్న సినిమా ఒకటి ఉంది.
ఆ చిత్రమే “బ్రహ్మాస్త”. తెలుగులో “బ్రహ్మాస్త్రం” గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరోయిన్ లుగా నటించారు. అలాగే మన తెలుగు నుంచి కింగ్ నాగార్జున కీలక పాత్ర చేశారు. మరి దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మరోస్థాయి రిలీజ్ కాబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.
ప్రపంచ ప్రముఖ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ వారు ఈ సినిమాలో చేరి ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేసిన ఈ సినిమాలు అన్నిటిని ఇలా చేస్తున్నారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.