బన్నీకి బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్స్ స్పెషల్ థాంక్స్..!

Published on Oct 28, 2021 3:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎప్పుడు నుంచో బాలీవుడ్ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎట్టకేలకు తన ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” ఫస్ట్ పార్ట్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే బన్నీ ఎంట్రీ పట్ల మంచి ప్లానింగ్స్ కూడా ఉండగా నిన్న జరిగినటువంటి వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్ కి అక్కడి బడా నిర్మాతలు, మేకర్స్ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

బన్నీ నిన్న మాట్లాడుతూ విడుదల కాబోతున్న పలు బాలీవుడ్ సినిమాలు కోసం కూడా మాట్లాడ్డం జరిగింది. కరోనా మూలాన బాలీవుడ్ జనం థియేటర్స్ వరకు వచ్చి సినిమా చూడటానికి సాహసించట్లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగు కావడంతో మళ్ళీ థియేటర్స్ కి ప్రేక్షకులు రావాలని అక్కడి మేకర్స్ భావిస్తుండగా నిన్న బన్నీ చేసిన బూస్టప్ కామెంట్స్ వారికి మరింత భరోసా ఇచ్చాయి. దీనితో బాలీవుడ్ బడా ఫిలిం మేకర్స్ రోహిత్ శెట్టి అలాగే కరణ్ జోహార్ లు బన్నీ కి స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :

More