రెండో వారం లో కూడా అక్కడ మంచి వసూళ్లను రాబట్టిన RRR

Published on Apr 8, 2022 9:30 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రెండో వారం సైతం మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు.

ఈ చిత్రం బాలీవుడ్ లో రెండో వారం కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. గురువారం మరో 5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన చిత్రం, మొత్తం 208 కొట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం కి ఈ వారం గట్టి పోటీ లేకపోవడం తో మూడో వారం కూడా బాక్సాఫీస్ వద్ద దూకుడు ను కొనసాగించనుంది. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు.

సంబంధిత సమాచారం :