మెగాస్టార్ కోసం బాలీవుడ్ డిజైనర్!

మెగాస్టార్ చిరంజీవి చేయనున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతంత్ర్యానికి ముందు ఉన్న వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా చూపడం కోసం కష్టపడుతున్నారు టీమ్. అందులో భాగంగానే చిరంజీవికి అప్పటి కాలం నాటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం కోసం బాలీవుడ్ డిజైనర్ అంజు మోడీని రంగంలోకి దింపిపారట టీమ్.

అంజు మోడీ గతంలో హిందీలో ‘రామ్ లీల, బాజీరావ్ మస్తాని’ వంటి హిట్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ప్రస్తుతం చిరంజీవి మీద లుక్ టెస్ట్ జరుగుతోందని త్వరలోనే సినిమాకు కావాల్సిన కాస్ట్యూమ్స్, ఆభరణాల డిజైన్లను రూపొందిస్తారని అంటున్నారు. స్వతహాగా డిజైనర్ అయిన, ‘ఖైదీ నెం 150’ కి పనిచేసిన చిరు కుమార్తె సుస్మిత కూడా ఆమెకు సహాయంగా ఉండనుంది.