‘డీజే’ సెట్లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందడి!
Published on Feb 1, 2017 12:39 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘డీజే- దువ్వాడ జగన్నాథం’ అనే సినిమా కొద్దికాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50% పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా, సెట్లో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సందడి చేశారు.

తన సినిమాకు సంబంధించిన పనుల నిమిత్తం రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన ఆయన, డీజే కోసం వేసిన ప్రత్యేక సెట్‌ను చూసి అక్కడికి వెళ్ళి టీమ్‌తో ముచ్చటించారు. దర్శకుడు హరీష్ శంకర్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ, తాను అభిమానించే దర్శకుడు రోహిత్ శెట్టి సెట్లో దర్శనమివ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న డీజే సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

 
Like us on Facebook