నాగ చైతన్య సరసన బాలీవుడ్ హీరోయిన్ ?


అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమాకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ప్రేమమ్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర రెగ్యులర్ షూట్ అక్టోబర్ 3వ వారంలో మొదలుకానుంది.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త వాళ్లయితే బాగుంటుందనుకున్న చందూ మొండేటి బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఇందులో విలన్ గా తమిళ నటుడు మాధవన్ ను కూడా అనుకుంటున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంతమేరకు వాస్తవముందో తెలియాలంటే చిత్ర టీమ్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.