రానా ‘హతి మేరే సాతి’ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.ప్రముఖ తమిళ్ డైరెక్టర్ సాల్మన్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈచిత్రం సెట్స్‌పైకి వెల్లనుందని సమాచారం. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో బాలివుడ్ హీరోయిన్ జోయా హుసేన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం రానా ‘1945’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ తో పాటు టైగర్ నాగేశ్వర్ రావ్ బయోపిక్ లో రానా నటించబోతున్నాడు. దొంగాట సినిమా దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. దీని తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిపుడు సినిమాలో చేస్తున్నాడు రానా. భారి బడ్జెట్ తో ఈ సినిమా తెరకేక్కబోతోంది.
