మహేష్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరోయిన్ ?

మహేష్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరోయిన్ ?

Published on Nov 14, 2022 9:00 AM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ నోరా ఫతేహి ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించబోతుంది. ఐతే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు