ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ హిట్

మళ్ళీ చాలా కాలం తర్వాత బాలీవుడ్ సినిమా నుంచి వరుస హిట్స్ స్టార్ట్ అయ్యిన సంగతి చూస్తున్నాము. కొందరు స్టార్ హీరోస్ అయితే ఒకదాని తర్వాత మంచి హిట్స్ ని అందుకుంటూ ఉండగా వారిలో అజయ్ దేవగణ్ (Ajay Devgn) కూడా ఒకరు. అయితే అజయ్ దేవగణ్ హీరోగా నటించిన చిత్రాలు ఈ ఏడాదిలోనే రెండు వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం “సైతాన్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రంతోనే జ్యోతిక బాలీవుడ్ డెబ్యూ ఇవ్వగా ఈ సినిమాని దర్శకుడు వికాస్ బాహి తెరకెక్కించగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఈరోజు నుంచి అయితే దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో హిందీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మాధవన్ విలన్ గా నటించిన ఈ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు ట్రై చేయవచ్చు.

Exit mobile version