రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” లో బాలీవుడ్ లెజెండరీ నటుడు.!

Published on Aug 2, 2022 9:11 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తన పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంని దర్శకుడు వంశీ భారీ హంగులతో ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా నుంచి అనౌన్సమెంట్ లు కూడా మంచి రేకెత్తించాయి. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ నుంచి అయితే ఓ క్రేజీ అప్డేట్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ లెజెండరీ నటుడు లేటెస్ట్ గా “కాశ్మీర్ ఫైల్స్” సెన్సేషన్ అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నపూర్ సనోన్ సహా తదితరులు నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :