డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ మెగాస్టార్ కొడుకు!

Published on Oct 3, 2021 1:31 pm IST


ఇండియన్ సినిమా దగ్గర భారీ ఎత్తున మార్కెట్ ఉన్న ప్రధాన సినిమా పరిశ్రమల్లో బాలీవుడ్ మార్కెట్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కలకలం వైరల్ అవుతుంది. ఇది వరకు పలు మార్లు సెన్సేషన్ అయ్యిన డ్రగ్స్ అంశం ఇప్పుడు మరోసారి బయటకొచ్చి సంచలనంగా మారింది. అంతే కాకుండా ఓ బాలీవుడ్ మెగాస్టార్ కొడుకు కూడా ఇందులో చిక్కడంతో వార్త మరింత వేడిని రాజేసింది.

అయితే దీనిపై ఇంకా లోతుగా వెళితే రీసెంట్ గానే ముంబైకి చెందిన ఎన్ సి బి(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) వారు జరిపిన దాడుల్లో ఓ విహారయానంకి కి వెళ్లిన ఓ బృందం దగ్గర భారీ ఎత్తున మాదకద్రవ్యాలు చిక్కినట్టుగా వెల్లడి అయ్యింది. దీనితో వారిని అదుపులోకి తీసుకోగా వారిలో బాలీవుడ్ కి చెందిన మెగాస్టార్ కొడుకు కూడా ఉన్నాడు కన్ఫర్మ్ చెయ్యడంతో ఈ వార్త మరింత సంచలనంగా మారింది.

తర్వాత వారికి అన్ని పరీక్షలు చెయ్యగా వారు డ్రగ్స్ తీసుకున్నారని కన్ఫర్మ్ చేసి వారిని కస్టడీలోకి కూడా తీసుకున్నారట. ఈరోజు ఆదివారం కావడంతో తర్వాత కోర్టులో వారిని ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇక ఇక్కడ నుంచి ఈ బాలీవుడ్ మెగాస్టార్ ఎవరు? ఆ చిక్కుకున్న వ్యక్తి ఎవరు అని సోషల్ మీడియాలో రచ్చ లేస్తుంది. మరి ఇది ఎవరో అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :