ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్ టచ్ పెరుగుతోంది !
Published on Aug 6, 2017 5:30 pm IST


‘బాహుబలి’ తరవాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా మారిపోయారు. అందుకే ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకులంతా తమ సినిమాల్లో బాలీవుడ్ టచ్ ఉండేలా చూస్తున్నారు. వీలైతే అసలు సినిమా బాలీవుడ్ పరిశ్రమ నుండే వచ్చింది అనే ఫీలింగ్ కలిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రసుతం సుజీత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ‘సాహో’ సినిమాలో హిందీ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండేలను తీసుకోగా దీని తర్వాత ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి కూడా హిందీ టచ్ మొదలైంది.

సాహో తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పనిచేయనున్నారు. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అందించారు. ఇలా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయి సినిమాలుగా రూపొందుతూ ఉన్నాయి.

 
Like us on Facebook