లేటెస్ట్ : ఎన్టీఆర్ తో మూవీ నిర్మించనున్న పాపులర్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ?

Published on Mar 25, 2023 3:00 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ 30వ మూవీ ఇటీవల వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుండగా దీన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్నాయి. కాగా ఈ మూవీని ఏప్రిల్ నుండి షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ తో తన నెక్స్ట్ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు ఎన్టీఆర్.

అయితే విషయం ఏమిటంటే, ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ టి సిరీస్ అధినేత అయిన భూషణ్ కుమార్ త్వరలో ఎన్టీఆర్ తో ఒక భారీ మూవీ నిర్మించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ న్యూస్. ఎన్టీఆర్ 30 మూవీ యొక్క ప్రారంభోత్సవానికి ఆయన ప్రత్యేకంగా ముంబై నుండి విచ్చేసారు. మరోవైపు ప్రస్తుతం ప్రభాస్ తో ఒక మూవీని అల్లు అర్జున్ తో ఒక మూవీని నిర్మిస్తున్న భూషణ్ కుమార్, త్వరలో ఎన్టీఆర్ తో ఒక బడా డైరెక్టర్ తెరకెక్కించే మూవీని నిర్మించనున్నారని, త్వరలోనే దీని గురించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :