అమ్మ పాత్రలో కంగనా రనౌత్ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. అయితే జయలలిత పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయలలితగా నటించడానికి అంగీకరించింది.

ఇక జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శకనిర్మాతలతో అమ్మ అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఎలా నటిస్తుందో చూడాలి.

Exit mobile version