బాలీవుడ్ లో మరింత ఆందోళనగా మారుతున్న ఈ రచ్చ..!

బాలీవుడ్ లో మరింత ఆందోళనగా మారుతున్న ఈ రచ్చ..!

Published on Aug 19, 2022 7:03 AM IST


ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాము. అనుకోని రీతిలో బాలీవుడ్ సినిమాలు భారీ స్థాయిలో విఫలం అవుతున్నాయి. అక్కడి బిగ్ స్టార్స్ సినిమాలు కూడా రాణించకపోతుండడంతో వారి అభిమానుల్లో పరిస్థితి మరింత ఆందోళన కరంగా మారింది.

ఇక ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో బాలీవుడ్ నుంచి మేజర్ ఆఫ్ ది ఆడియెన్స్ మరిన్ని సినిమాలు బాయ్ కాట్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని గట్టి సంకేతాలు ఇప్పుడు పలువురి హీరోల అభిమానులని భయపెడుతున్నాయి. వస్తున్న ప్రతి సినిమాని కూడా బాయ్ కాట్ చెయ్యాలంటూ వస్తున్న కొత్త ట్రెండ్ తో ఆడియెన్స్ అనుకున్నంత పనీ చేస్తున్నారు.

దీనితో ఈ కొత్త సినిమాల పరిస్థితి కాస్త ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం అయితే షారుఖ్ మరియు హృతిక్ సినిమాలు టార్గెట్ గా మారాయి. దీనితో వారి అభిమానులు సోషల్ మీడియాలో డిఫెండ్ చేసే పనిలో పడ్డారు. మరి ఆ సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు