క్రేజీ బజ్ : NTR 30 లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటి ఫిక్స్ ?

Published on Feb 14, 2023 12:17 am IST


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అతి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 మూవీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ పాన్ ఇండియన్ మూవీకి అనిరుద్ స్వరాలు సమకూరుస్తుండగా దీని ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని ఇటీవల రిలీజ్ చేసారు. కాగా ఈ పోస్టర్ లో అనిరుద్ అందించిన బీజీఎమ్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

కాగా ఈ మూవీని ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే నెల చివర్లో పట్టాలెక్కించనున్నట్లు ఇటీవల అమిగోస్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ తెలిపారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెతో యూనిట్ ఒప్పందం కుదుర్చుకుందని, అలానే ఆమె ఈ మూవీ కోసం కాల్షీట్స్ కేటాయించారని అంటున్నారు. కాగా అతి త్వరలో దీనికి సంబంధించి యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఇటు నార్మల్ ఆడియన్స్ లో ఎంతో భారీ క్రేజ్ సంపాదించిన ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 4 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :