దర్శకుడిగా మారతానంటున్న స్టార్ హీరో !

aamir khan

బాలీవుడ్ మోస్ట్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లో స్టార్ హీరో అమిర్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు. హీరోగానే కాకుండా అమిర్ దర్శకుడు కూడా. అలాగే అమిర్ లో చక్కని అభిరుచి గల నిర్మాత కూడా ఉన్నాడు. ఆయన నిర్మాణ సంస్థలో లగాన్, దంగల్, తారే జమీన్ పర్ లు వంటి మంచి చిత్రాలను అమిర్ నిర్మించారు.

అలాగే తారే జమీన్ పర్ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. అయినా ఆ సినిమా తరువాత మళ్ళీ అమిర్ ఇంతవరకూ దర్శకత్వం చేయలేదు. కాగా తాజాగా అమిర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు మళ్లీ దర్శకుడిగా మారే ఆలోచన ఉందా అని ప్రశ్నించింది.

యాంకర్ ప్రశ్నకు అమిర్ బదులిస్తూ.. దర్శకత్వం అనేది తన కల, తన కోరిక అని ఖచ్చితంగా మళ్ళీ దర్శకుడిగా మారతానని… అయితే దర్శకత్వం చెయ్యాలి అని నిర్ణయించుకునే ముందే.. ఇక నటనకు గుడ్ బై చెప్పేస్తానని అమిర్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version