షారుఖ్ ఖాన్ పై అభిమానాన్ని చాటుకున్న హృతిక్ రోషన్ !

25th, January 2017 - 01:43:13 PM


భారీ అంచనాల నడుమ షారుఖ్ ఖాన్ ‘రయీస్’, హృతిక్ రోషన్ ‘కాబిల్’ చిత్రాలు నేడు విడుదలవుతున్న విషయం తెలిసిందే.రెండు చిత్రాల కోసం ఇద్దరు స్టార్ హీరోలు భారీగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

కాగా హృతిక్ రోషన్ ట్విట్టర్ ద్వారా షారుఖ్ ఖాన్ కి రయీస్ విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు. షారుఖ్ ఖాన్ ని తన మెంటర్ గా సంభోదించాడు. మరోసారి తన మెంటర్ తనని రయీస్ చిత్రం ద్వారా మెప్పిస్తాడని అన్నాడు.అలాగే కాబిల్ చిత్రంతో తాను కూడా షారుఖ్ ని మెప్పిస్తానని తెలిపాడు. కాగా హృతిక్ కాబిల్ చిత్రం తెలుగులో ‘బలం’ పేరుతో విడుదల అవుతోంది.