మహేష్ “పోకిరి” ను మిస్ చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Published on Sep 25, 2023 12:06 am IST


రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో, పి. వాసు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి2. ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023 న గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం లో కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటించింది. ఈ చిత్రం కి సంబందించిన ప్రమోషన్స్ లో భాగం గా ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో, కంగనా తాను టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం పోకిరిలో భాగం కావడం మిస్ అయ్యానని వెల్లడించింది.

పోకిరి కోసం తనను సంప్రదించినప్పుడు గ్యాంగ్‌స్టర్: ఎ లవ్ స్టోరీ అనే హిందీ చిత్రంతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. ఈ రెండు చిత్రాల షూటింగ్ అక్టోబర్ 2005లో జరిగాయి. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం తో పోకిరి చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది అని, పోకిరి చిత్రాన్ని చేయనందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. అయితే టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా అరంగేట్రం చేసింది.

సంబంధిత సమాచారం :