బాలీవుడ్ మాజీ స్టార్ హీరో, కేంద్ర మాజీ మంత్రి వినోద్ ఖన్నా(70) మృతి చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, సన్నిహితులు హుటా హుటిన హాస్పిటల్ కి చేరుకున్నారు. తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న వినోద్ ఖన్నా 1968 లో సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తనదైన నటనతో మెప్పించి హీరోగా కూడా సక్సెస్ అయ్యారు. దాదాపు 141 సినిమాల్లో నటించిన విజయ్ ఖన్నా హఠాన్మరణం చెందడంతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 1946 అక్టోబర్ 6న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో వినోద్‌ఖన్నా జన్మించారు. 1971లో గీతాంజలిని వినోద్‌ఖన్నా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు.