తెలుగు ఆస్ట్రో మున్నంగి బాలుపై బాలీవుడ్ స్టార్స్ ప్రసంశలు..!

Published on Nov 24, 2021 10:04 am IST

ఏ సినిమాలో అయిన 24 శాఖలు ఉంటాయి. అయితే ఆయా శాఖల్లో పనిచేసే వారి పేర్లను సినిమా యొక్క టైటిల్ కార్డ్స్‌లో వేస్తారన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ టైటిల్ కార్డ్స్‌లోకి కొత్తగా ఇప్పుడు ఆస్ట్రో కన్సల్టెంట్ అనేది చేరింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన హిట్ సినిమా ‘షేర్షా’లో ఆస్ట్రో కన్సల్టెంట్ బాలు మున్నంగి పేరు టైటిల్ కార్డ్‌లో పడింది. ‘షేర్షా’ నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ గతంలో ఒకసారి జ్యోతిషం పరంగా తనకు సలహాలు ఇస్తూ, మద్దతుగా నిలుస్తున్నందుకు బాలు మున్నంగికి థాంక్స్ చెప్పారు. దీంతో అసలు ఎవరీ బాలు మున్నంగి అన్న చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది.

అయితే తాజాగా కరణ్ జోహార్ “రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహానీ” చిత్ర సెట్స్ లో బాలు మున్నంగి బాలీవుడ్ స్టార్స్ ను కలవడం జరిగింది. రణ్వీర్ సింగ్, అలియా భట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలుగారి గుడ్ వర్క్ గురించి కాసేపు సెట్స్ లో ముచ్చటించారు.

బాలీవుడ్ స్టార్స్ కరణ్ జోహార్, అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సిద్ధార్థ్ మల్హోత్రా,’షేర్షా’ దర్శకుడు విష్ణువర్థన్ మొదలుకుని పలువురు హిందీ సినిమా ప్రముఖులకు బాలు మున్నంగి ఇప్పుడు సెంటిమెంట్‌గా మారిపోయాడు. సినిమా ప్రారంభోత్సవాలు, పనులకు ఆయన చేత ముహూర్తాలు పెట్టించుకుని ముందడుగు వేస్తారు. అజయ్ దేవగణ్ ‘తానాజీ’ చిత్రానికి బాలు మున్నంగి పెట్టిన ముహూర్తాలనే ఫాలో అయ్యారు. అలాగే, ‘మే డే’కి కూడా! ‘తానాజీ’ తర్వాత ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ చేస్తున్న దర్శకుడు ఓం రౌత్ సైతం, బాలు మున్నంగిని ఫాలో అవుతున్నారు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ‘బాలు మున్నంగి’కి ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమారాలజీలలో ఇరవై మూడేళ్ల సుదీర్ఘ అనుభవముంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వదేశీ, విదేశీ రాజకీయ నేతలు కూడా బాలు మున్నంగి జోస్యాన్ని గట్టిగా నమ్ముతున్నారు. ‘బాలు మున్నంగి ప్రిడిక్షన్స్ అన్ రియల్’ అంటూ ఆయన సన్నిహిత మిత్రుడు, హీరో అజయ్ దేవగణ్ చెబుతుంటే, ఆయన చెప్పినవి ఫాలో అవడం వల్ల తనకొచ్చిన క్యాన్సర్ కూడా నయమైందని సంజయ్ దత్ చెప్పారు. స్టార్స్ ఇద్దరు చెప్పిన మాటలను బట్టి బాలు మున్నంగి భవిష్యవాణి ఎంతమంచిదో అర్థమవుతుంది. పలువురు తెలుగు ప్రముఖులు సైతం బాలు మున్నంగి అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్, లైబీరియా ప్రెసిడెన్షియల్ అభ్యర్థి మెక్ డెల్లా కూపర్ లాంటి విదేశీ రాజకీయ ప్రముఖులు సైతం ఆయనను ఇన్‌స్టాలో ఫాలో అవుతూ సలహాలు సూచనలు తీసుకోవడం విశేషం. ఇక పలువురు తెలుగు ప్రముఖులు సైతం బాలు మున్నంగిని గట్టిగానే ఫాలో అవుతున్నారు.

సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు వ్యక్తిగతంగా బాలు మున్నంగి సలహాలు తీసుకుంటున్నారు. ఇంతమంది దేశ, విదేశాల ప్రముఖులు ఆయన చెప్పే విషయాలతో ఏకీభవిస్తూ అనుసరిస్తున్నారంటే బాలు మున్నంగిని చూసి తెలుగు వారిగా మనం గర్వపడాలనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :