ప్రస్తుతం కోలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న కొన్ని ప్రాజెక్ట్ లలో దర్శకుడు వెంకట్ ప్రభు మరియు దళపతి బిజె జోసెఫ్ కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం కన్నా ముందు “లియో” తో విజయ్ రాబోతుండగా దీనిపై సెన్సేషనల్ హైప్ అయితే నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఇలాంటి సినిమా తర్వాత వస్తున్నా సినిమా వెంకట్ ప్రభుతో కావడంతో మరింత హైప్ దీనిపై ఉంటుంది.
మరి అందుకు తగ్గట్టుగానే వెంకట్ ప్రభు కూడా మాసివ్ ప్లానింగ్ లు చేస్తున్నట్టుగా ఇపుడు రూమర్స్ మొదలయ్యాయి. అలా లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం గాను బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడైన అమీర్ ఖాన్ ని అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది నిజం అయితే పాన్ ఇండియా మార్కెట్ లో భారీ మైలేజ్ ఈ సినిమాకి వస్తుంది అని చెప్పొచ్చు. మరి ఇపుడు వైరల్ గా మారిన ఈ బజ్ ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగి చూడాల్సిందే.