“RRR” సినిమాపై బాలీవుడ్ వెర్సటైల్ నటుడు ప్రశంసల జల్లు.!

“RRR” సినిమాపై బాలీవుడ్ వెర్సటైల్ నటుడు ప్రశంసల జల్లు.!

Published on May 3, 2022 8:14 AM IST

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లను ఈ చిత్రం నమోదు చేసింది.

అయితే అనేకమంది సినీ ప్రముఖులు నుంచి మంచి ఫీడ్ బాక్ ని అందుకుంటున్నా ఈ సినిమాపై అవి ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ వెర్సిటైల్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురిపించారు. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా చూడ్డం జరిగింది అని ఈ సినిమా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందించింది అని తెలిపారు. అలాగే రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఎలక్ట్రిఫయింగ్ గా అలరించారు. సినిమాలో పాటలు, యాక్షన్, డాన్స్ లు అన్ని అదిరిపోయాయ్ అని తెలిపి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు