“లవ్ ఆల్ ది హేటర్స్” అంటూ పూరి పుట్టిన రోజున బొమ్మ బ్లాక్ బస్టర్ టీమ్ ట్రిబ్యూట్!

Published on Sep 26, 2021 9:16 pm IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర యూనిట్ సరికొత్త ప్లాన్ చేయడం జరిగింది. లవ్ ఆల్ ది హేటర్స్ అంటూ ఒక పాట తో ట్రిబ్యూట్ ఇచ్చేందుకు సిద్దం అయింది. రేపు సాయంత్రం అయిదు గంటలకు ఇందుకు సంబంధించిన పాట ను బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ పాటను ప్రణవ్ చాగంటి మరియు మంగ్లి లు కలిసి పాడటం జరిగింది. పూరీ ఆంతేం గా వస్తున్న ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

నందు మరియు రష్మీ గౌతమ్ లు హీరో హీరోయిన్ లుగా రాజ్ విరాట్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి ఈడ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :