మెగా హీరోతో బొమ్మరిల్లు భాస్కర్ కొత్త చిత్రం !

మెగా హీరోతో బొమ్మరిల్లు భాస్కర్ కొత్త చిత్రం !

Published on Oct 25, 2021 10:57 PM IST

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ మూవీగా అలరిస్తోంది. అయితే, తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ కు మరో ఛాన్స్ వచ్చిందట. గీతాఆర్ట్స్ బ్యానర్‌లో మరో చిత్రం చేసేందుకు బొమ్మరిల్లు భాస్కర్ రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేదు.

కాకపోతే, మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఈ చిత్రాన్ని చేయనున్నారని తెలుస్తోంది. ఇక దర్శకుడిగా భాస్కర్ కు చాలా కాలం తర్వాత మంచి హిట్ వచ్చింది. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ లాంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాస్కర్‌ మధ్యలో సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే, ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ లు కూడా రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఓ స్క్రిప్ట్‌ రెడీగా ఉందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు