సెన్సేషన్ హీరోయిన్ కి నోటీసులు పంపిన ప్రముఖ నిర్మాత !

మలయాళ బ్యూటీ వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఏడాది సౌత్ నుండి గూగూల్ ట్రెండ్స్ లో టాప్ ప్లేస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నోటీసులు పంపారు. విషయంలోకి వెళ్తే.. ‘శ్రీదేవి బంగ్లా’ అనే టైటిల్ తో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తే సినిమాలో ప్రియా, ‘శ్రీదేవి’ అనే సూపర్ స్టార్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉన్నట్టుంది తెలుస్తోంది. దాంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ప్రియా ప్రకాష్ వారియర్ తో పాటు ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా టీమ్ కి కూడా నోటీసులు పంపారు.

సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘భగవాన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ మాబుల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version