వరుసగా పవన్ సినిమాలు చూస్తున్న బాస్ బ్యూటీ.!

Published on Jun 7, 2023 7:59 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తాను గెస్ట్ రోల్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో అయితే నటిస్తున్న చిత్రం “బ్రో ద అవతార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో అయితే లేటెస్ట్ గా మన భారీ హిట్ చిత్రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య బాస్ బ్యూటీ ఊర్వశి రైతేలా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టుగా లాక్ అయ్యింది.

మరి ఈ సినిమా లోకి ఎంటర్ అవుతూనే ఈ యంగ్ బ్యూటీ అయితే పవన్ నటించిన వింటేజ్ సినిమాలు చూడడం స్టార్ట్ చేసింది. మొన్ననే “ఖుషి” తో స్టార్ట్ చేసిన తాను లేటెస్ట్ గా “బద్రి” చూస్తున్నాను అని తెలిపింది. దీనితో ఇలా వరుసగా పవన్ సినిమాలు అయితే ఇప్పుడు ఈమె చూసేస్తుంది. ఇక ఇప్పుడు బ్రో లో అయితే వీరిపై సాంగ్ షూట్ జరుగుతుండగా దర్శకుడు సముద్రకని అండ్ టీం ఈ పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :