వైరల్ : “బాస్ పార్టీ”కి డీఎస్పీతో చిందేసిన ఊర్వశి..!

వైరల్ : “బాస్ పార్టీ”కి డీఎస్పీతో చిందేసిన ఊర్వశి..!

Published on Dec 27, 2022 7:08 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ మహారాజ రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా తాను ఇచ్చిన మూడు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

మరి డీఎస్పీ ఇచ్చిన ఫస్ట్ సింగ్ బాస్ పార్టీ అయితే ఇప్పటికీ సాలిడ్ రెస్పాన్స్ తో యూట్యూబ్ లో అదరగొడుతూ ఉండగా ఇక ఈ సాంగ్ లో కనిపించిన బ్యూటీ ఊర్వశి రౌటేలా అయితే ఇప్పుడు ఈ సాంగ్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ తో అయితే మంచి ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తున్న వీడియో ని తాను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఇది సంతోషం అవార్డ్స్ రిహార్సల్స్ లో అయితే వారు చేస్తుండగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రం అయితే ఈ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

https://www.instagram.com/reel/Cmqqbavou1m/?utm_source=ig_web_copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు