సెన్సేషనల్ రెస్పాన్స్ తో “బాస్ పార్టీ” రచ్చ.!

సెన్సేషనల్ రెస్పాన్స్ తో “బాస్ పార్టీ” రచ్చ.!

Published on Dec 6, 2022 10:12 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి అయితే ఆల్రెడీ వచ్చిన టైటిల్ టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ అయితే రిలీజ్ అయ్యి క్రేజీ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సాంగ్ అయితే ఇప్పుడు క్రేజీ రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తుంది.

మరి మొదటి రోజే సాలిడ్ రెస్పాన్స్ ని కొల్లగొట్టిన ఈ సాంగ్ లేటెస్ట్ గా అయితే ఈ సాంగ్ ఏకంగా 2 కోట్ల వ్యూస్ తో అదరగొట్టింది. మరి ఈ చిత్రం ఆల్బమ్ లో మొదటి అయితే నెక్స్ట్ లెవెల్లో హిట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే సంక్రాంతి కానుకగా అయితే ఈ చిత్రం రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు