ఇద్దరు సాఫ్ట్ వేర్స్ ఒకేరోజు వస్తున్నారు !

సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ మరియు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమాలు ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఒకేరోజు ఇద్దరు మెగాహీరోలు రావడం విశేషం. ఈ విషయాన్ని మనం గతంలోనే చర్చించుకున్న, ఇక్కడా ఎవ్వరికి తెలియని విషయం ఒకటి ఉంది.

గమ్మత్తు ఏంటంటే ఇద్దరు హీరోలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా కనిపించబోతున్నారు. ఇటీవలే విడుదలైన తొలిప్రేమ సినిమా పాటలు పాపులర్ అయ్యాయి. త్వరలో ఇంటిలిజెంట్ సాంగ్స్ రాబోతున్నాయి. రెండు సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. ఇంటిలిజెంట్ మాస్ ఎంటర్టైనర్ గా వినాయక్ మార్క్ లో రాబోతుండగా తొలిప్రేమ ఫ్యూర్ లవ్ స్టోరీగా వస్తోంది. చూద్దాం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుందో ?

Exit mobile version