రామ్ ఆశలన్నీ ఇప్పుడు ఆ సినిమా పైనే ?

Published on Aug 16, 2022 3:00 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ ఇప్పుడు ఈ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ‘ది వారియర్’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రామ్ నిరాశలో ఉన్నాడు. కనీసం బోయపాటితో చేసే చిత్రం అయినా భారీ విజయం సాధిస్తోంది అని రామ్ ఆశిస్తున్నాడు. పైగా బోయపాటి అఖండతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అందుకే, రామ్ – బోయపాటి సినిమా పై భారీ అంచనాలు ఉండే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట. ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం :