స్కంద కి పార్ట్ 2 ప్లాన్ చేసిన బోయపాటి!

Published on Sep 28, 2023 1:05 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారి బోయపాటి శ్రీనుతో జతకట్టిన చిత్రం స్కంద. ఈ చిత్రం నేడు థియేటర్ల లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. అప్డేట్ ప్రకారం, మేకర్స్ సినిమా చివర్లో ఒక లీడ్‌ని వదిలారు. అంటే రానున్న రోజుల్లో స్కందకు సీక్వెల్ రాబోతుంది. స్కంద పార్ట్ 2కి సంబంధించిన ఈ న్యూస్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

యాక్షన్‌, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రంలో రామ్ ఊర మాస్ అవతార్ లో కనిపించాడు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ లు ఈ సినిమా లో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ళను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :