చిరు, మహేష్, బాలయ్యలకు కథలు సిద్ధం చేశానంటున్న స్టార్ డైరెక్టర్ !


ప్రస్తుత స్టార్ దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను తాజా చిత్రం ‘జయ జానకి నాయక’ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబులకు కథలు సిద్ధం చేశానని నెక్స్ట్ వారితోనే సినిమాలు చేస్తానని అన్నారు.

ముందుగా చిరు ప్రాజెక్ట్ గురించి చెబుతూ ఆయన కోసం కథ సిద్ధంగా ఉందని ఆయన చేయనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పూర్తవగానే చేసే యోచనలో ఉన్నానని అన్నారు. ఇక మహేష్ తో చర్చలు జరిపాడు గానీ కథ ఇంకా చెప్పలేదని, ఎక్కువ డేట్స్ అవసరమవుతాయి కనుక ఆలోచిస్తున్నామని అన్నారు. ఇక బాలయ్యకు ఒక పవర్ ఫుల్ కథ రెడీ చేశానని, వచ్చే సంవత్సరం మే లేదా జూన్ లో ఆ సినిమా ప్రారంభమవుతుందని తెలిపారు.