“అఖండ”పై అందుకే బోయపాటి ఎక్కువగా మాట్లాడడంలేదా?

Published on Dec 1, 2021 3:00 am IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. కానీ ఈ సినిమాను గురించి బోయపాటి ఇప్పటివరకు తనదైన స్టైల్లో మాట్లాడకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పైగా నేను ఏదైనా సినిమా రిలీజ్ తరువాతే మాట్లాడతానని, ఇప్పుడేమి మాట్లాడడని చెబుతుండడం విశేషం. అయితే దీనికి కారణం లేకపోలేదని, గతంలో ‘వినయ విధేయ రామ’ సినిమా విషయంలో చెప్పినదొకటి.. జరిగింది ఒకటి కావడంతో విపరీతమైన ట్రఒలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అందుకే ఈ సారి బోయపాటి తన పరిధి దాటి మాట్లాడటం లేదని చెప్పుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :