బాలయ్య సినిమా సెట్స్‌లో సందడి చేసిన బోయపాటి..!

Published on Mar 12, 2022 1:00 am IST


నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 ప్రాజెక్ట్ పేరిట ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్‌ని మాస్ దర్శకుడు బోయపాటి సందర్శించాడు. ఈ మేరకు చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ తెలియచేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ నటిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :