బన్నీ సినిమా కోసం బోయపాటి కసరత్తులు !

Published on Jan 10, 2022 12:01 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, ఇప్పటికే బోయపాటి బన్నీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అందుకే బోయపాటి బన్నీతో చేయబోయే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా కథను కూడా వినూత్నంగా ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట.

అలాగే టేకింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. తన బేనర్ లో బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా చేయబోతున్నాడని ఓ స్టేజ్ మీద అల్లు అరవింద్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ కోసం ఓ స్క్రిప్టును కూడా బోయపాటి సిద్ధం చేశాడు. ఈ సినిమా పక్కా యాక్షన్ తో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా బన్నీకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

కాగా ఆల్ రెడీ సరైనోడు అనే సూపర్ హిట్ సినిమా వీరి ఖాతాలో ఉంది. ఏది ఏమైనా హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం :