రామ్ “ది వారియర్” కోసం బోయపాటి శ్రీను, శివ కార్తికేయన్!

Published on Jun 30, 2022 7:05 pm IST


రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈ చిత్రం లో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. రామ్ సరసన హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతి శెట్టి నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను రేపు రాత్రి 7:57 గంటలకు విడుదల చేయనున్నారు. అదే విధంగా తమిళ్ ట్రైలర్ ను హీరో శివ కార్తికేయన్ డిజిటల్ గా విడుదల చేయనున్నారు. ది వారియర్ కోసం వీరిద్దరూ ట్రైలర్ ను విడుదల చేస్తుండటం తో సినిమా పై మరింత హైప్ నెలకొంది. ఈ చిత్రం కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, జూలై 14, 2022 న సినిమాను భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :