మరో మెగాహీరోని టార్గెట్ చేసిన బోయపాటి !


‘జయ జానకి నాయక’తో ఇంకో విజయాన్నితన ఖాతాలో వేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కు హీరోగా మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చిన ఆయన తాన తర్వాతి సినిమాను స్టార్ హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా మెగాహీరోతో అని టాక్.

ఇప్పటికే మెగా కాంపౌండ్ లో అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆయన, ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఎంచుకున్నారట. దీని కోసం మంచి కథను కూడా రెడీ చేసుకున్నాడని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రం చేస్తున్న చరణ్ తన తరవాత సినిమా ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. కాబట్టి బోయపటితో సినిమా కన్ఫర్మ్ చేసుకుంటారని టాక్. ప్రస్తుతానికి ఇరువురి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా త్వరలో వెల్లడిస్తారని ఇండస్ట్రీలో గుస గుసలు వినబడుతున్నాయి.