స్టార్ హీరోలతో ‘భద్ర’, ‘తులసి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్’ లాంటి పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తీసి బోయపాటి శ్రీను టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ లో ఒకరయ్యారు. ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బోయపాటి శ్రీను మొదటి సారిగా కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ తో తన తదుపరి సినిమా చేయనున్నాడు.
వివి వినాయక్ డైరెక్షన్ లో అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన రెండవ సినిమా కూడా అనుభవజ్ఞుడైన కమర్షియల్ డైరెక్టర్ తో చేయనుండడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బోయపాటి శ్రీను తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మరో రెండు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని కూడా బెల్లంకొండ సురేష్ నిర్మించే అవకాశం ఉంది.
