స్టార్ట్ కెమెరా.. యాక్షన్ అంటున్న బోయపాటి !

యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కొత్త చిత్రం ఈరోజే రెగ్యులర్ షూట్ ను ప్రారంభించుకోనుంది. మొదటి షాట్ ను గచ్చిబౌలిలోని ఒక గుడిలో తీయనున్నారు బోయపాటి. అలవాటు ప్రకారం ‘బాబు.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ అనే బోయపాటి డైలాగ్ తో మొదటి షాట్ ఉండబోతోంది.

అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ఉండనుంది. ప్రస్తుతం ‘రంగస్థలం’ షూట్లో ఉన్న చరణ్ కొన్ని రోజుల తరవాత బోయపాటి సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించనుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, ఏ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ ను అందించనున్నారు.