బాలయ్య కోసం కొత్త కథ రాసిన బోయపాటి ?

Published on Sep 4, 2023 7:02 am IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో ‘అఖండ 2’ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అఖండ సినిమాకు సీక్వెల్ స్క్రిప్ట్ కూడా ఆల్ రెడీ పూర్తి అయిందని ఆ మధ్య బాలయ్య కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. బాలయ్య తో బోయపాటి చేస్తున్న కథలో సోషియో ఫాంట‌సీ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని.. కాకపోతే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య – దర్శకుడు బాబీ కలయికలో ఓ సినిమా రాబోతుంది. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాబీ.. మరి బాలయ్యతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా తర్వాతే బాలయ్య – బోయపాటి ‘అఖండ 2’ సినిమా స్టార్ట్ అవుతుందట.

సంబంధిత సమాచారం :