షారుఖ్ “పఠాన్” కి పెద్ద ఎత్తున బాయ్ కాట్ సెగ.!

షారుఖ్ “పఠాన్” కి పెద్ద ఎత్తున బాయ్ కాట్ సెగ.!

Published on Dec 14, 2022 10:02 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్”. బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం కూడా నటించాడు. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రంతో షారుఖ్ ఖాన్ మళ్ళీ గ్రాండ్ కం బ్యాక్ ఇస్తాడు అనుకునే సమయంలో లేటెస్ట్ గా చిత్రానికి గట్టి షాక్ తగిలింది అని చెప్పాలి.

గత కొన్నాళ్ల కితం బాలీవుడ్ సినిమాల విషయంలో వినిపించిన బాయ్ కాట్ ట్యాగ్ లు మళ్ళీ ఈ సినిమా విషయంలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ లో హీరోయిన్ దీపికా పదుకొనె వస్త్రధారణ మరియు వాటి రంగు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని పొలిటికల్ గా కూడా ఊహించని రకంగా వైరల్ గా మారింది. దీనితో అక్కడ నుంచి నార్త్ లో ఆడియెన్స్ ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యాలని పిలుపునిచ్చారు. దీనితో ఇది ఈరోజుకి కూడా ట్రెండ్ అవుతూ వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు