‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రేజీ రైడ్ “బాయ్స్ హాస్టల్”

Published on Nov 10, 2023 9:00 am IST

రీసెంట్ గా కన్నడ సినిమా దగ్గర సూపర్ హిట్ అయ్యి తెలుగులో డబ్ అయ్యాక కూడా మంచి సక్సెస్ ని అందుకున్న చిత్రాల్లో దర్శకుడు నితిన్ కృష్ణ మూర్తి తెరకెక్కించిన ఈ చిత్రంలో చాలా మంది కొత్త నటీనటులు నటించగా స్టార్ నటుడు రిషబ్ శెట్టి శెట్టి కూడా ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ క్యామియో చేసాడు. ఇక తెలుగులో అయితే తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్ లాంటి వాళ్ళు నటించిన ఒక క్రేజీ రైడ్ చిత్రం “బాయ్స్ హాస్టల్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం తెలుగులో కూడా మంచి అందుకోగా ఈ సినిమా ఓటిటి డెబ్యూ కోసం చూసినవాళ్ళకి అయితే ఇప్పుడు ఫైనల్ గా గుడ్ న్యూస్ వచ్చేసింది. మరి ఈ చిత్రంని స్ట్రీమింగ్ యాప్స్ లో ఒకటైన ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అందులో అయితే తెలుగు వెర్షన్ ఇప్పుడు అధికారికంగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు డెఫినెట్ గా ఇప్పుడు ఈటీవీ విన్ యాప్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం :