ఆర్ ఆర్ ఆర్ పై పెరుగుతున్న అంచనాలు…భీమ్ వీడియో విడుదల!

Published on Dec 8, 2021 11:31 am IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం ట్రైలర్ ను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. థియేటర్ల లో ప్రదర్షితమ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా భీమ్ కి సంబంధించిన చిన్నపాటి వీడియో ను విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అంటూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :