నాగ్ అశ్విన్ ను వింత కోరిక కోరిన న‌టుడు బ్ర‌హ్మాజీ

నాగ్ అశ్విన్ ను వింత కోరిక కోరిన న‌టుడు బ్ర‌హ్మాజీ

Published on Jul 1, 2024 8:00 PM IST

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ ఎపిక్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ ఇటీవ‌ల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేస్తోంది.

‘క‌ల్కి’ క‌ళ్లు చెదిరే క‌లెక్షన్స్ తో దూసుకెళ్తోంది. కేవ‌లం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా రూ.555 కోట్ల వ‌సూళ్లు సాధించి ఔరా అనిపించింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే న‌టుడు బ్ర‌హ్మాజీ కూడా త‌న‌దైన కామెడీ టైమింగ్ తో క‌ల్కి మేక‌ర్స్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

”తెలుగు సినిమా అనుకొంటే వ‌ర‌ల్డ్ సినిమా తీశారు.. నాగ్ అశ్విన్ గారు మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే, ముద్దు పెట్టుకుంటాను.. థ్యాంక్యూ ప్రియాంక, స్వ‌ప్న‌.. మీ రిస్కులే మీకు శ్రీ‌రామ ర‌క్ష‌..” అంటూ బ్ర‌హ్మాజీ ట్విట్ట‌ర్ లో కామెంట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు