హార్ట్ టచింగ్ గా ‘రంగమార్తాండ’ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్

హార్ట్ టచింగ్ గా ‘రంగమార్తాండ’ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ టీజర్

Published on Feb 2, 2023 1:04 AM IST


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా సినిమా రంగమార్తాండ. మరాఠీ మూవీ నటసామ్రాట్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోగా ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీకి అందించిన శాయరీ మరింతగా అలరించింది. ఇక నేడు పద్మశ్రీ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఆయన ఫస్ట్ లుక్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు.

ఎప్పుడూ సినిమాల్లో అందరినీ కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్ తో అలరించే హాస్యబ్రహ్మ, ఈ టీజర్ లో హార్ట్ టచింగ్ గా సాగే మంచి ఎమోషనల్ డైలాగ్ ని అద్భుతంగా పలికి అందరినీ కదిలించారు. రంగస్థల కళాకారుల జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా ఇతర పాత్రల్లో రాహుల్ సింప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, శివాత్మిక, ఆలీ రెజా నటిస్తున్నారు. కాగా ఈ మూవీకి రాజ్ కె నల్లి ఫోటోగ్రఫి అందిస్తుండగా రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మించాయి. కాగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు